- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి కోమటిరెడ్డిని కలిసిన బీజేపీ MP అర్వింద్.. విషయం ఇదే!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో తెలంగాణ బీజేపీ కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ భేటీ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy)తో తెలంగాణ బీజేపీ కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(Arvind Dharmapuri) భేటీ అయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో కలిసి గత 15 నెలలుగా పెండింగ్‌లో రూ.8.68 కోట్ల నిధులకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. దీనికి మంత్రి కోమటిరెడ్డి సానుకూలంగా స్పందించారు. తక్షణమే మంజూరు ఉత్తర్వులను జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రికి ఎంపీ అర్వింద్ ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, ఇదే విషయమై గతంలో సీఎం రేవంత్ రెడ్డిని సైతం ధర్మపురి అర్వింద్ కలిశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను ఎంపీ అర్వింద్ వివరిస్తూ, మాధవ్ నగర్ ఆర్ఓబీ 50-50 పద్దతిలో మంజూరు చేయబడిందని, అడివి మామిడిపల్లి ఆర్ఓబీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైనప్పటికీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను మళ్ళించిందన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులు అందక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దీనివల్ల పనుల్లో కొంత జాప్యం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఇతర ఆర్వోబీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని సీఎంకు వివరించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేసి, పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలని గతంలో సీఎంను కోరారు.






