బెంగాల్ అస్తిత్వాన్ని బీజేపీ దెబ్బతీస్తోంది: టీఎంసీ

by Malleboina Mahesh |

గుజరాత్ స్థానిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం! అహ్మదాబాద్, వడోదరలో క్లీన్ స్వీప్ దిశగా కమలం. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ లకి గట్టి పోటీ.

బెంగాల్ అస్తిత్వాన్ని బీజేపీ దెబ్బతీస్తోంది: టీఎంసీ
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన "బెంగాల్ గుడ్ బై" (Bengal Good Bye) గ్రాఫిక్‌పై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఇది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదని, బెంగాల్ అస్తిత్వాన్ని చెరిపి వేసేందుకు బీజేపీ ఇస్తున్న బహిరంగ హెచ్చరిక అని టీఎంసీ నేతలు మండిపడ్డారు. బెంగాల్ సంస్కృతిని, బెంగాలీ భాషను, ఇక్కడి చారిత్రక వారసత్వాన్ని తుడిచిపెట్టి.. అందరినీ ఒకే మూసలో (Homogenise) నెట్టాలని బీజేపీ చేస్తోందని ఆరోపించారు.

ఈ సందర్భంగా టీఎంసీ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. "బీజేపీ బెంగాల్‌ను పాలించడానికి రావడం లేదు, బెంగాల్‌ను విచ్ఛిన్నం చేయడానికి వస్తోంది. 'గుడ్ బై బెంగాల్' అంటే.. బెంగాలీ సాహిత్యం, ఆహారం, ఐకాన్స్ మరియు మన ఆత్మగౌరవానికి ముగింపు పలకడమే" అని పేర్కొంది. రెండో దశ పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ, రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసేలా బీజేపీ వ్యవహరిస్తోందని, బెంగాల్ వ్యతిరేక శక్తులకు ఓటుతో బుద్ధి చెప్పాలని టీఎంసీ పిలుపునిచ్చింది. మే 4న వెలువడనున్న ఫలితాల్లో బెంగాల్ ప్రజలే ఎవరికి 'గుడ్ బై' చెబుతారో తేలుతుందని ధీమా వ్యక్తం చేసింది.

Next Story