- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ బీహార్ ను మోసం చేసింది : తేజస్వి యాదవ్
బీహార్‌లో అధికార మార్పిడిపై ప్రతిపక్ష నేత, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం బీహార్‌లో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న సమ్రాట్ చౌధరి ముఖ్యమంత్రి రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మార్పుపై ప్రతిపక్ష నేత, ఆర్జేడీ (RJD) అధినేత తేజస్వి యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదంతా బీజేపీ ముందుగా రచించిన ఒక పెద్ద వ్యూహం "Pre-planned" అని ఆయన అభివర్ణించారు. నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రి పీఠం నుండి దూరం చేసి, రాష్ట్రంపై పూర్తి పట్టు సాధించడానికే బీజేపీ ఆయనను రాజ్యసభకు పంపించిందని తేజస్వి ఆరోపించారు. "బీజేపీ అటు నితీష్ కుమార్‌ను, ఇటు బీహార్ ప్రజలను ఘోరంగా మోసం చేసింది. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు అస్సలు పొంతన లేదు" అంటూ ఆయన మండిపడ్డారు.
ప్రస్తుతానికి నితీష్ కుమార్ కేర్ టేకర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ, ఏప్రిల్ రెండవ వారంలో ఆయన రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తిస్థాయిలో బీహార్ సీఎం ఎవరనేది ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ అధికార మార్పిడి బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందని మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. ముఖ్యంగా 2025 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడిన రాజకీయ అనిశ్చితి మధ్య, నితీష్ కుమార్ జాతీయ రాజకీయాలకు వెళ్లడం వల్ల జేడీయూ భవిష్యత్తుతోపాటు ఎన్డీయే వర్సెస్ మహాగఠబంధన్ మధ్య పోరాటం మరింత ఆసక్తికరంగా మారనుందని అంటున్నారు. బీహార్ ప్రజలు ఈ నాయకత్వ మార్పును ఎలా స్వీకరిస్తారు అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.






