కేరళలో బీజేపీ సర్కార్ మా అంతిమ లక్ష్యం: అమిత్ షా

by Malleboina Mahesh |

ఇటీవల కేరళలో జరిగిన లోకల్, పంచాయతీ, మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఎన్డీయే కూటమి అనేక స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.

కేరళలో బీజేపీ సర్కార్ మా అంతిమ లక్ష్యం: అమిత్ షా
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కేరళలో జరిగిన లోకల్, పంచాయతీ, మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఎన్డీయే కూటమి (NDA alliance) అనేక స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం తిరువనంతపురంలో కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులను ఆయన సన్మానించారు. అలాగే వారిని ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) మాట్లాడుతూ.. కేరళలో 'కమలం' గుర్తు పై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, బీజేపీ ముఖ్యమంత్రిని పీఠంపై కూర్చోబెట్టడమే తమ అంతిమ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అలాగే

తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ (LDF) 40 ఏళ్ల పాలనకు ముగింపు పలుకుతూ బీజేపీ సాధించిన చారిత్రక విజయం కేవలం ఒక మైలురాయి (Stepping stone) మాత్రమేనని, అసలైన గమ్యం రాష్ట్రంలో అధికారంలోకి రావడమేనని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు కనుమరుగవుతున్నారని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాభవం కోల్పోతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF), కమ్యూనిస్టుల ఎల్డీఎఫ్ మధ్య ఉన్న 'మ్యాచ్ ఫిక్సింగ్' కారణంగానే కేరళ అభివృద్ధి కుంటుపడిందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

2047 నాటికి ప్రధాని మోడీ కలలు కంటున్న 'వికసిత్ భారత్' ('Developed India') సాధనలో కేరళ అభివృద్ధి అత్యంత కీలకమని, అది కేవలం ఎన్డీయేతోనే సాధ్యమని అమిత్ షా అభిప్రాయపడ్డారు. రాష్ట్ర భద్రతను, శతాబ్దాలుగా వస్తున్న ప్రజల విశ్వాసాలను కాపాడే సత్తా ఎన్డీయేకే ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌లోని 101 వార్డులకు గాను ఎన్డీయే ఏకంగా 50 వార్డులను కైవసం చేసుకుని అతిపెద్ద కూటమిగా అవతరించిన విషయం తెలిసిందే. ప్రజలకు స్పష్టమైన విజన్, వినయంతో సేవ చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు అమిత్ షా పిలుపునిచ్చారు.

Next Story