కేజ్రివాల్‌ను బీజేపీ చంపాలని చూస్తోంది: మనీష్ సిసోడియా

by Disha Web Desk 17 |
కేజ్రివాల్‌ను బీజేపీ చంపాలని చూస్తోంది: మనీష్ సిసోడియా
X

న్యూఢిల్లీ: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడిపై ఆప్ నేతలు తీవ్రంగా స్పందించారు. బీజేపీ గుండాలు ఇంటిపై దాడి చేసి కేజ్రివాల్ ను చంపేందుకు ప్రయత్నించారని ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మనీష్ సిసోడియా అన్నారు. కేజ్రివాల్ ను తొలగించే కుట్ర ఉందని చెప్పారు. ఢిల్లీ పోలీసులు బీజేపీ గుండాలను అరవింద్ కేజ్రివాల్ ఇంటి వద్దకు తీసుకువచ్చారు. ఇది ఉద్దేశపూర్వక కుట్రగానే జరిగింది. బీజేపీ అరవింద్ కేజ్రివాల్ ను ఎన్నికల్లో ఓడించకపోవడంతో ఆయనను చంపాలని అనుకుంది అని అన్నారు. నిరసనకారులు భద్రతా గేట్లను , సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారని ఆయన అన్నారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందని చెప్పారు. బీజేపీ పంజాబ్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేకపోయింది. ఆప్ భారీ విజయాన్ని నమోదు చేసింది. బీజేపీ నిలవలేకపోయింది అని అన్నారు. కాగా, కేజ్రివాల్ అసెంబ్లీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తనకు కశ్మీర్ పండిట్లు ముఖ్యమని, సినిమా కాదని చెప్పారు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కశ్మీరీ పండిట్లను ఉద్దేశించి నవ్వలేదని, బీజేపీని చూసి నవ్విందని తెలిపారు.

Next Story

Most Viewed