- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచాయతీ కార్యాలయంలో గులాబీ వేడుకలు..
దిశ, బూర్గంపాడ: బూర్గంపాడు పంచాయతీ - Birthday Celebrations of MP Nama Nageswararao at Bourgampadu Panchayat Office

దిశ, బూర్గంపాడ: బూర్గంపాడు పంచాయతీ కార్యాలయంలో నామా యూత్ ఆధ్వర్యంలో పార్లమెంటరీ నేత ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు మంగళవారం నిర్వహించారు. నామ యూత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దుదుకురి రాజా, సర్పంచ్ సిరిపురపు స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత పాల్గొని కేక్ కట్ చేశారు.
తమ సొంత కార్యాలయంగా..?
పంచాయతీ కార్యాలయాన్ని తమ సొంత కార్యాలయంగా సర్పంచ్ ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. పార్టీ కార్యక్రమాలకు పిలుపునిచ్చినప్పుడు చేయడం సర్వసాధారణం. మండలం లో ఎక్కడ నామా జన్మదిన వేడుకలు నిర్వహించలేదు. కానీ బూర్గంపాడు పంచాయతీ కార్యాలయంలో మాత్రం తమ ఇష్టానుసారంగా వ్యవహరించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మండల అధికారులు మాత్రం ఈ విషయంపై తమకు ఎటువంటి సమాచారం లేదని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.






