- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో బయో-టెర్రర్ కుట్ర.. డాక్టర్‌తో సహా ముగ్గురిపై ఎన్ఐఏ చార్జ్‌షీట్!
హైదరాబాద్ డాక్టరు సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ బయో-టెర్రర్ కుట్రపై ఎన్ఐఏ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. రిసిన్ విషంతో సామూహిక హత్యలకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని హైదరాబాద్ లో వెలుగు చూసిన బయో-టెర్రర్ కుట్ర కేసు (Bio-terror conspiracy case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌కు చెందిన చైనా మెడికల్ గ్రాడ్యుయేట్ డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్, తన ఇంటినే ఒక రహస్య ప్రయోగశాలగా మార్చి 'రిసిన్' (Ricin) అనే అత్యంత ప్రమాదకరమైన బయో-టాక్సిన్‌ను తయారు చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఆముదం గింజల నుంచి తీసే ఈ విషం అత్యంత ప్రాణాంతకమైనది. దీనిని రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో ప్రయోగించి భారీ స్థాయిలో ప్రాణనష్టం కలిగించాలని ఐసిస్ హ్యాండ్లర్ల ఆదేశంతో నిందితులు ప్లాన్ చేశారు. నవంబర్ 2025లో గుజరాత్‌లోని ఒక టోల్ ప్లాజా వద్ద నిందితుడి కారులో ఆయుధాలు, ఆముదం నూనె పట్టుబడటంతో ఈ కుట్ర బయట పడింది.
ఈ కుట్రలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆజాద్, మొహమ్మద్ సుహెల్ అనే మరో ఇద్దరు నిందితులు కూడా పాల్గొన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. వీరు రాజస్థాన్ నుండి ఆయుధాలు, నిధులను సేకరించి మొహియుద్దీన్‌కు అందించేవారు. ఈ ఘోరానికి ఒడిగడితే మొహియుద్దీన్‌ను దక్షిణాసియా ఐసిస్ 'అమీర్'గా నియమిస్తామని విదేశీ హ్యాండ్లర్లు వాగ్దానం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు ఇప్పటికే ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్ వంటి నగరాల్లో రెక్కీ నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. నిందితులపై ఉపా (UAPA) చట్టం కింద కేసులు నమోదు చేసిన ఎన్ఐఏ (NIA), అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టులో చార్జ్‌షీట్ (Chargesheet) సమర్పించింది.






