- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో వివాదంలో బిహార్ సీఎం నితీష్
బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరో వివాదంలో ఇరుక్కున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఓ సభలో మాట్లాడుతున్న నితీష్ కుమార్.. మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురువారం సివాన్ జిల్లాలో జరిగిన 'సమృద్ధి యాత్ర' కార్యక్రమంలో ఆయన స్పీచ్ ఇస్తుండగా.. సభలో ఉన్న కొంతమంది మహిళలు బయటకు వెళ్లడం గమనించిన నితీశ్ కుమార్ మైక్‌లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. "మహిళలు ఎందుకు వెళ్లిపోతున్నారు? మీ కోసమే ఈ కార్యక్రమం. ఇక్కడే ఉండాలి, వినాలి" అంటూ గట్టిగా మండిపడ్డారు.
అయితే సభలో మహిళలు వెళ్లిపోతుంటే ఆయన ఇలాగే అసహనం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఫైనల్లీ మహిళలను పట్టించుకున్నారు అంటూ కొందరు నెటిజన్స్ వెటకారంగా కామెంట్ చేయగా, మరికొందరు మహిళలకు వెళ్లే స్వేచ్ఛ ఉండాలి.. ఇలా మాట్లాడటం కంట్రోల్ చేసేలా ఉందని విమర్శిస్తున్నారు.






