- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్‌డేట్.. KCRకు మరో నోటీసు ఇవ్వనున్న సిట్

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) విచారణ కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) విచారణకు హాజరు కావాల్సిందిగా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, నిన్న ఇచ్చిన నోటీసు ప్రకారం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి నెలకొనడం, పార్టీ అంతర్గత సమావేశాల్లో బిజీగా ఉన్న కారణంగా ఆయన విచారణకు రాలేనని సిట్‌కు లేఖ రాశారు.
మరో నోటీసు ఇవ్వనున్న సిట్..
కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సిట్ అధికారులు, తదుపరి విచారణ తేదీని ఖరారు చేస్తూ రేపు మరో నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. ఆ నోటీసులో విచారణకు హాజరు కావాల్సిన ఖచ్చితమైన సమయం, ప్రదేశాన్ని కూడా పేర్కొనబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, విచారణ ఎక్కడ జరగాలనే అంశంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. చట్టపరమైన నిబంధనల ప్రకారం వయసురీత్యా కేసీఆర్ పోలీస్ స్టేషన్‌కు రానక్కర్లేదని.. ఆయన కోరుకున్న చోట విచారణ జరిపేందుకు సిట్ వెసులుబాటు కల్పించింది. దీంతో హైదరాబాద్ పరిధిలోని నందినగర్ నివాసంలో విచారణ జరపాలని అధికారులు భావిస్తున్నారు. కానీ, ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఉంటున్నందున విచారణ అక్కడే జరగాలని కోరుతున్నట్లుగా పార్టీ వర్గాలు తెలపియా.






