- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూకట్‌పల్లి దోపిడీలో బిగ్ ట్విస్ట్.. రూ.10 నోటుతో రూ.21 కోట్ల హవాలా దందా!
కూకట్‌పల్లి దోపిడీ కేసులో సంచలన నిజం. రూ.10 నోటు కోడ్‌తో జరిగిన రూ.21 కోట్ల హవాలా నగదు బదిలీ. కళ్లలో కారం కొట్టి డబ్బు దోచుకెళ్లిన దుండగులు.

దిశ, వెబ్ డెస్క్: కూకట్‌పల్లి హవాల డబ్బు (Money laundering) దోపిడి వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఈ రోజు జరిగిన నగదు దోపిడీ కేసు (Robbery case)లో విచారణ జరుపుతున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. తొలుత ఈ దోపిడీ సొమ్ము తక్కువ మొత్తంలో ఉంటుందని భావించినప్పటికీ, లోతైన విచారణలో అది ఏకంగా రూ.21 కోట్ల హవాలా నగదు అని తేలడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ నగదు బదిలీ ప్రక్రియ మొత్తం ఒక పక్కా సినిమా స్కెచ్‌ను తలపిస్తోంది. హవాలా ఏజెంట్లు ఒక వ్యాపారి వద్దకు వెళ్లి, ముందే నిర్ణయించుకున్న ఒక రూ.10 నోటును సీక్రెట్ కోడ్‌గా చూపించి ఈ భారీ మొత్తాన్ని వసూలు చేసినట్లు సమాచారం.
అయితే, ఈ డబ్బును డెస్టినేషన్ పాయింట్‌కు తరలిస్తుండగా దుండగులు పక్కా ప్లాన్‌తో దాడికి దిగారు. బాధితుల కళ్లలో కారం కొట్టి, క్షణాల్లో ఆ రూ.21 కోట్లను దోచుకెళ్లారు. ఈ వ్యవహారంలో పక్కా సమాచారం ఉన్న వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హవాలా డబ్బు కావడం వల్ల బాధితులు మొదట ఫిర్యాదు చేయడానికి వెనుకాడారు, కానీ కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ భారీ నెట్‌వర్క్ వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.






