- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరల్డ్ కప్ వేళ ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్లు దూరం
టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి మరికొన్ని రోజుల మాత్రమే ఉండగా.. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి మరికొన్ని రోజుల మాత్రమే ఉండగా.. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు (Australian cricket team)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్ను గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగారు. గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న కమిన్స్, టోర్నీ సమయానికి కోలుకుంటారని భావించినప్పటికీ, వైద్య పరీక్షల అనంతరం అతను ఆడే పరిస్థితి లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (CA) స్పష్టం చేసింది. దీంతో పాటు మరో కీలక ఆటగాడు మ్యాథ్యూ షార్ట్ కూడా జట్టులో చోటు కోల్పోవడం ఆసీస్ శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది.
ప్యాట్ కమిన్స్ దూరం కావడం ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగానికి పెద్ద లోటుగా మారనుంది. ముఖ్యంగా భారత్, శ్రీలంక వంటి ఉపఖండ పిచ్‌లపై కమిన్స్ అనుభవం జట్టుకు ఎంతో అవసరమైన తరుణంలో ఈ వార్త ఆసీస్ అభిమానులను నిరాశకు గురిచేసింది. కమిన్స్ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బెన్ ద్వార్షుయిస్ (Ben Dwarshuis)ను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. అలాగే, పేలవ ఫామ్ కారణంగా తప్పుకున్న మ్యాథ్యూ షార్ట్ స్థానంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మ్యాట్ రేన్‌షా (Matt Renshaw)కు అవకాశం కల్పించారు.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్‌ను ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో ఆడనుంది. కీలకమైన మ్యాచ్‌లకు ముందు జట్టులో జరిగిన ఈ మార్పులు ఆసీస్ వ్యూహాలను దెబ్బతీసే అవకాశం ఉంది. అయితే, మిచెల్ మార్ష్ నాయకత్వంలోని ఆసీస్ జట్టు ఈ సవాళ్లను అధిగమించి ఎలా రాణిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.






