- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్‌బాస్ బ్యూటీకి షాక్.. రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన వ్యక్తి.. అసలేం జరిగిందంటే?
బిగ్‌బాస్ బ్యూటీ ఖుషీ ముఖర్జీ(Khushi Mukherjee) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి.

దిశ, సినిమా: బిగ్‌బాస్ బ్యూటీ ఖుషీ ముఖర్జీ(Khushi Mukherjee) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. తాను ఏ క్రికెటర్‌తోనూ డేటింగ్ చేయాలనుకోవడం లేదని, గతంలో పలువురు క్రికెటర్లు తనను సంప్రదించారని చెప్పిన ఖుషీ, భారత స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) పేరు ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఇంటర్వ్యూలో ఖుషీ మాట్లాడుతూ, “నాకు క్రికెటర్లతో రిలేషన్‌లో ఉండాలనే ఆసక్తి లేదు. ఒకప్పుడు చాలామంది క్రికెటర్లు నా వెంట పడేవాళ్లు. సూర్యకుమార్ యాదవ్ తరచూ మెసేజ్ చేసేవాడు. కానీ ఇప్పుడు అతను నాతో పెద్దగా మాట్లాడడం లేదు. నేనూ తిరిగి కలవాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం ఎవ్వరితోనూ రిలేషన్‌లో ఉండాలనుకోవడం లేదు” అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై సూర్యకుమార్ యాదవ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒక అభిమాని ఖుషీ ముఖర్జీ వ్యాఖ్యలను “పచ్చి అబద్ధాలు”గా పేర్కొంటూ, ఆమెపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించాడు. “సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు. ఆయనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం తగదు. అందుకే ఘాజీపూర్ నుంచి ముంబైకి వచ్చి ఖుషీ ముఖర్జీపై లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాను” అంటూ ఆ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఖుషీ వ్యాఖ్యలను తప్పుబడుతుండగా, మరికొందరు వ్యక్తిగత అభిప్రాయాలను పబ్లిక్‌లో చెప్పే హక్కు ఉందంటూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.
Read More..






