ఎస్‌ఆర్‌హెచ్‌కు బిగ్ బూస్ట్.. జట్టుతో కలవనున్న కెప్టెన్ పాట్ కమిన్స్

by Malleboina Mahesh |

ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ నేడు బెంగళూరు చేరుకోనున్నారు. వెన్నునొప్పి గాయం తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి క్లియరెన్స్ లభించింది.

ఎస్‌ఆర్‌హెచ్‌కు బిగ్ బూస్ట్.. జట్టుతో కలవనున్న కెప్టెన్ పాట్ కమిన్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అన్ని జట్లు గాయాల బెడదను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు సైతం పలు ప్లేయర్లను కోల్పోయే ప్రమాదంలో పడింది. కానీ హైదరాబాద్ అభిమానులకు ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందే మంచి శుభవార్త అందింది. వెన్నునొప్పి గాయం కారణంగా గత కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్న కెప్టెన్ పాట్ కమిన్స్ (Captain Pat Cummins) పూర్తిగా కోలుకోవడంతో, అతను ఐపీఎల్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) అనుమతి ఇచ్చింది. దీంతో కమిన్స్ ఈరోజే (మార్చి 24) బెంగళూరు చేరుకుని జట్టుతో కలవనున్నారు. అయితే, అతను వెన్నునొప్పి నుంచి ఇప్పుడే కోలుకున్నందున, మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగే తొలి మ్యాచ్‌లో ఆడటంపై ఇంకా స్పష్టత రాలేదు. కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ (Ishan Kishan) జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

మరోవైపు, శ్రీలంక యువ బౌలర్ ఎషాన్ మలింగా (Eshan Malinga) కూడా ఎస్‌ఆర్‌హెచ్ క్యాంపులో చేరడం జట్టు బౌలింగ్ విభాగానికి మరింత బలాన్ని ఇచ్చింది. మలింగకు శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) క్లియరెన్స్ ఇవ్వడంతో అతను కూడా ఈ రోజే జట్టుతో కలవనున్నారు. కమిన్స్ రాకతో జట్టులో నూతనోత్సాహం నెలకొనగా, అతను ఎప్పటి నుంచి బరిలోకి దిగుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కమిన్స్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైనా, మలింగా వంటి మేటి బౌలర్లు అందుబాటులో ఉండటం హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చే అంశం. ఆరెంజ్ ఆర్మీ తన తొలి పోరులో ఆర్సీబీని ఢీకొట్టేందుకు సర్వం సిద్ధమైంది.

Next Story