- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 10 రోజులపాటు తీవ్ర వడగాలులు
తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ విభాగం(IMD) రెడ్ అలర్ట్స్ జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ విభాగం(IMD) రెడ్ అలర్ట్స్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే 10 రోజుల పాటు అనగా ఏప్రిల్ 12 నుండి 22 వరకు సూర్యుని ప్రకోపానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ 10 రోజులు తీవ్రమైన వడగాలులతోపాటు, ఎండలు దంచికొట్టనున్నాయి. సాధారణంగా ఏప్రిల్ చివరిలో లేదా మే నెలలో కనిపించే తీవ్రమైన వడగాలులు, ఈసారి ముందే రానున్నాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44°C నుండి 45°C వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్స్ జారీ చేసింది. అయితే సాయంత్రం పూట అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉన్నప్పటికీ, అవి కేవలం గాలిలో తేమను పెంచి ఉక్కపోతను అధికం చేస్తాయే తప్ప, వేడి నుండి ఎలాంటి ఉపశమనం కలిగించవని వాతావరణ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా పరిస్థితి దారుణంగా ఉండబోతోందని HMD పేర్కొంది. ఏప్రిల్ 12 నుండి 22 వరకు ఎడతెరిపి లేకుండా వరుసగా పది రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు 40°C - 41°C వరకు కొనసాగనున్నాయి. సాధారణంగా నగరంలో 'హీట్ ఐలాండ్' ప్రభావంతో రాత్రి సమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవచ్చు. ప్రజలు మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అనవసర ప్రయాణాలు చేయవద్దని, తగినంత నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు ఈ వడగాలుల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని తెలియజేసారు.






