సన్‌రైజర్స్ అభిమానులకు బిగ్ అలర్ట్.. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌కు టికెట్లు విడుదల!

by Malleboina Mahesh |

ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 5న SRH vs LSG మ్యాచ్! ఇవాళ సాయంత్రం 5 గంటలకు టికెట్లు విడుదల. 'District' యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి.

సన్‌రైజర్స్ అభిమానులకు బిగ్ అలర్ట్.. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌కు టికెట్లు విడుదల!
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు మొదటి మ్యాచ్ ఈ నెల 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. అనంతరం రెండో మ్యాచ్ భాగ్యనగరంలో జరుగుతుంది. సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్‌లో జరిగే తొలి పోరుకు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. సొంత గడ్డపై ఆరెంజ్ ఆర్మీ (Orange Army) ఆడే మొదటి మ్యాచ్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు సన్‌రైజర్స్ యాజమాన్యం తీపి కబురు అందించింది. ఏప్రిల్ 5వ తేదీన ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Rajiv Gandhi International Cricket Stadium)లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో తలపడనున్న మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఇవాళ (మార్చి 26) సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు 'SRH' అధికారికంగా ట్విట్టర్ (X) వేదికగా వెల్లడించింది.

అభిమానులు ఈ మ్యాచ్ టికెట్లను 'District' యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సన్‌రైజర్స్, ఈసారి సొంత మైదానంలో ఆడే తొలి మ్యాచ్ కావడంతో టికెట్లకు భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. టికెట్లు విడుదలైన కొద్ది నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యే ఛాన్స్ ఉండటంతో, ఫ్యాన్స్ అంతా సిద్ధంగా ఉండాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు. ఉప్పల్ స్టేడియంను ఆరెంజ్ మయంగా మార్చేందుకు సిద్ధంగా ఉండాలని ఆరెంజ్ ఆర్మీ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

Next Story