శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. మరికాసేపట్లో జూన్ నెల 'ప్రత్యేక దర్శన' టికెట్ల విడుదల

by Malleboina Mahesh |

వృద్ధులు, దివ్యాంగుల కోసం జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్లు నేడు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. మరికాసేపట్లో జూన్ నెల ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారిని దర్శించుకొవాలనుకునే భక్తులకు టీటీడీ (TTD) బిగ్ అలర్ట్ జారీ చేసింది. జూన్ 2026 లో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించు కోవాలనుకునే వృద్ధులు (Senior Citizens), దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు టీటీడీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ కేటగిరీలకు సంబంధించిన ఉచిత ప్రత్యేక దర్శన కోటా టికెట్ల (Special darshan quota tickets)ను నేడు (మార్చి 23, సోమవారం) మధ్యాహ్నం సరిగ్గా 3:00 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వేసవి సెలవుల దృష్ట్యా జూన్ నెలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ టికెట్లు విడుదలైన కొద్ది నిమిషాల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది.

ఈ టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ (TTD official website) ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. వృద్ధులు తమ ఆధార్ కార్డును, దివ్యాంగులు సంబంధిత ప్రభుత్వ ధృవీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. దర్శనం సమయంలో ఒరిజినల్ ఐడీ కార్డులను వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. టెక్నికల్ ఇబ్బందులు కలగకుండా ఉండటానికి, భక్తులు మధ్యాహ్నం 2:58 గంటలకే వెబ్‌సైట్‌లో లాగిన్ అయి సిద్ధంగా ఉండటం మంచిదని టీటీడీ అధికారులు సూచించారు.

Next Story