- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఏప్రిల్ నెలలో దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సమాచారం అందించింది. 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన వివిధ సేవా టికెట్ల కోటాను ఇవాళ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఉదయం 10 కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ వంటి ఆర్జిత సేవా టికెట్లు విడుదలవుతాయి. ఇక మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు (Virtual Sevas), వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను అందుబాటులో ఉంచుతారు.
అదేవిధంగా జనవరి 23 అంటే రేపు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక కోటా విడుదలకానున్నాయి. ఎల్లుండి ఉదయం 10 గంటలకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ ప్రారంభం కానుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.






