- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యార్థులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యార్థులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి నెలలో జరగనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అధికారికంగా ఇవాళ విడుదల చేసింది. విద్యార్థులు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాని అందులో మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుందన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఇంటర్ ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్, పుట్టిన తేదీతో అధికారిక వెబ్‌సైట్‌కు https://bie.ap.gov.in/ వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. అదేవిధంగా ‘మన మిత్ర’ సర్వీస్ నంబర్ 9552300009 ద్వారా కూడా విద్యార్థులు సమాచారాన్ని పొందవచ్చని అధికారులు వెల్లడించారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, అందులో విద్యార్థి పేరు, ఫోటో, సంతకం, పరీక్ష కేంద్రం పేరు, కేటాయించిన తేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు. ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలని బోర్డు సూచించింది.






