జనాలు అలాంటి క్యారెక్టర్లే కోరుకుంటున్నారు.. అందుకే అలా చేస్తున్నా

by Dishafeatures2 |
జనాలు అలాంటి క్యారెక్టర్లే కోరుకుంటున్నారు.. అందుకే అలా చేస్తున్నా
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ బ్యూటీ భూమి పెడ్నేకర్ నటించిన తాజా చిత్రం 'బదాయ్ దో'. ఇటీవల విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోగా భూమి పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అయితే తాజాగా ఈ బ్యూటీ వెటరన్ యాక్టర్‌ నవాజుద్దీన్ సిద్ధిఖీతో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుపగా.. అందులోనూ విభిన్న పాత్ర పోషించబోతున్నట్లు చెప్పింది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. 'ఎంతో కాలంగా నవాజ్ సర్‌తో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్న. ఎందుకంటే దేశంలోని అత్యుత్తమ నటుల్లో ఆయనొకరు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం లభించినందుకు హాపీగా ఉంది' అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తను నటించబోయే తాజా సినిమాలన్నీ బాధిత స్త్రీల తరుఫున పోరాడే పాత్రలే చేస్తున్నానని, ప్రేక్షకులు కూడా అలాంటి క్యారెక్టర్ కోరుకుంటున్నారని చెప్పింది. అంతేకాదు సినిమా పరిశ్రమలో ఉన్న మూస ధోరణులను బద్దలు కొట్టాలనుకుంటున్నట్లు తెలపడం విశేషం.

సమంత ఘాటు రిప్లై.. మీ పని మీరు చూసుకోండి అంటూ.


Next Story

Most Viewed