- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్ వివాదాస్పద పోస్టు.. భారత్ ఆగ్రహం
భారత్ నరకకూపం అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను ఉద్దేశించి చేసిన "హెల్‌హోల్" వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. తన 'ట్రూత్ సోషల్' వేదికగా బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ను విమర్శిస్తూ చేసిన ఈ పోస్ట్, భారతీయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చైన్ మైగ్రేషన్ ద్వారా అమెరికా అస్తిత్వానికి ముప్పు కలుగుతోందని ఆయన చేసిన ఆరోపణలు, వలసదారుల పట్ల ఆయనకున్న కఠిన వైఖరిని మరోసారి బయటపెట్టాయి. భారత్ వంటి మిత్రదేశాన్ని అగౌరవపరిచేలా మాట్లాడటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు "జాత్యహంకారం" (Racism) అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
కాగా ఈ వివాదంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ చేసిన పోస్టులోని వ్యాఖ్యలు అనుచితమైనవి, అజ్ఞానంతో నిండినవని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఓ ప్రకటనలో పేర్కొంది. అమెరికా-భారత్ సంబంధాలు పరస్పర గౌర, ఉమ్మడి ప్రయోజనాలపై ఉంటాయనే విషయాన్ని అమెరికా గుర్తు పెట్టుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే, ట్రంప్ తన వ్యాఖ్యల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రధాని మోదీని తన "గ్రేట్ ఫ్రెండ్" అని, భారత్ ఒక "గొప్ప దేశం" అని పేర్కొంటూ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టారు. అయినప్పటికీ, ఒక దేశాధినేత స్థాయిలో ఉండి ఇంతటి వివాదాస్పద పదజాలాన్ని ఉపయోగించడం భారత్-అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని విశ్లేషకులు చర్చిస్తున్నారు.






