ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించాలి : డీఐజీ ఆర్. భాస్కరన్

by Batti.Sumithra |

ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడమే ప్రతి పోలీసు అధికారి లక్ష్యంగా పనిచేయాలని బాసర జోన్ డీఐజీ ఆర్. భాస్కరన్ అన్నారు.

ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించాలి : డీఐజీ ఆర్. భాస్కరన్
X

దిశ, ఆదిలాబాద్: ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడమే ప్రతి పోలీసు అధికారి లక్ష్యంగా పనిచేయాలని బాసర జోన్ డీఐజీ ఆర్. భాస్కరన్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్‌తో కలిసి డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ, ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సమాచార వ్యవస్థను పటిష్టం చేసి, నేరాలను ముందుగానే గుర్తించి అరికట్టాలని సూచించారు. బేసిక్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్, ప్రో-యాక్టివ్ పోలీసింగ్‌ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, సోషల్ మీడియాలో విద్వేషపూరిత ప్రచారం, తప్పుడు పోస్టుల పై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లా కావడంతో గంజాయి, మాదకద్రవ్యాలు, అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ, నాణ్యమైన పోలీసు సేవలు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పి. మౌనిక, ఐపీఎస్, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే తదితరులు పాల్గొన్నారు.

Next Story