కేంద్ర బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డి బెంగాల్ సీఎం

by Malleboina Mahesh |   (  Updated:2026-02-01 12:55:47  IST  )

ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి.. లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2026-2027ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొత్తం వ్యయాన్ని (Total Expenditure) ₹53 లక్షల కోట్లుగా ప్రతిపాదించింది.

కేంద్ర బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డి బెంగాల్ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి.. లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2026-2027ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొత్తం వ్యయాన్ని (Total Expenditure) ₹53 లక్షల కోట్లుగా ప్రతిపాదించింది. ఈ బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన మూడు కారిడార్ల అంశం కేవలం "అబద్ధాల పుట్ట" అని, ఇప్పటికే తాము ఆ ప్రాజెక్టులపై పని చేస్తున్నామని ఆమె విమర్శించారు. పురూలియాలోని 'జంగల్ సుందరి' ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వమే ₹72,000 కోట్లు పెట్టుబడి పెడుతోందని, బెంగాల్‌కు కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.

జీఎస్టీ (GST) ద్వారా రాష్ట్రాల నుంచి డబ్బులు వసూలు చేస్తూ, తిరిగి తామే నిధులు ఇస్తున్నట్లు కేంద్రం గొప్పలు చెప్పుకుంటోందని మమత మండిపడ్డారు. దేశ ఆర్థిక, రాజ్యాంగ నిర్మాణాన్ని, స్వతంత్ర సంస్థలను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని, అందువల్ల వారికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రం కేవలం మాటలకే పరిమితం అవుతుందని, పనులు చేయడం లేదని ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ విమర్శించారు.

Next Story