- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బార్లను తలపిస్తున్న బెల్ట్ షాపులు
మిర్యాలగూడ పట్టణంలోని ప్రాంతాలలో బెల్ట్ షాపులు బార్లను తలపిస్తున్నాయి.

దిశ, మిర్యాలగూడ : మద్యం బెల్ట్ షాపులు అంటే నామమాత్రంగా ఇంట్లో నడిపిస్తుంటారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రాంతాలలో బెల్ట్ షాపులు బార్లను తలపిస్తున్నాయి. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి లైసెన్సు తీసుకున్న బార్ల కంటే బెల్ట్ షాప్ లోనే మద్యం విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. దీంతో మిర్యాలగూడ పట్టణంలోని బెల్ట్ షాప్ ల వ్యాపారం మూడు బీరు బాటిల్లు.. ఆరు ఫుల్ బాటిల్లు అన్న చందంగా వ్యాపారం కొనసాగుతుంది. బెల్ట్ షాపులలో ఏసీలను పెట్టి నిర్వహిస్తున్నారు. పేరుకు హోటల్ పేరు పెడుతూ మద్యం విక్రయిస్తూ అక్రమమార్జనకు పాల్పడుతున్నారు. నాన్ వెజ్ తో పాటు పలు రకాల వంటకాలు ఏర్పాటు చేసి మద్యం ప్రియులను ఆకర్షిస్తున్నారు. దీంతోపాటు బెల్టు షాపులలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్ వ్యాపారం సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బహిరంగంగా బెల్ట్ షాప్ లలో మద్యం విక్రయిస్తున్న పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం నెలవారి మామూలు తీసుకొని సాయ సహకారాలు అందిస్తున్నారు.
ఏసీ రూములతో నిర్వహణ
మిర్యాలగూడ పట్టణంలోని పలుచోట్ల బెల్ట్ షాపుల నిర్వహించేవారు ఏసీ రూములను ఏర్పాటు చేస్తున్నారు. కిరాణం షాపులలో మద్యం అమ్మడానికి అనుమతులు లేని చోట కూడా ఏకంగా ఏసీ రూములను ఏర్పాటు చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఏసీ రూముల పేరుతో ఫుల్ బాటిల్ కు 120 రూపాయలు అదనంగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏసీ పేరు చెప్పి మందు ప్రియుల జేబులకు చిల్లు పెడుతున్నారు. హోటల్ పేరు, కిరాణం షాపు పేర్లు పెట్టి బెల్ట్ షాపులను నడుపుతున్నారు. హోటల్ పేరుతో వివిధ రకాల మాంసాలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అధిక ధరలకు మద్యం విక్రయం
బెల్ట్ షాపులలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని బెల్ట్ షాపులలో ఏసీ రూమ్లను ఏర్పాటు చేసి క్వార్టర్ కు 40 రూపాయలు చొప్పున ఫుల్ బాటిల్ కి 120 రూపాయలు, ఒక బీరు బాటిల్ పై 30 రూపాయల చొప్పున అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతోపాటు 13 రూపాయల వాటర్ బాటిల్ ను 25 రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఐపీఎల్ బెట్టింగ్ ఆరోపణలు
మిర్యాలగూడ పట్టణంలో ఎక్కువగా హోటల్ తో పాటు బెల్టు షాపులలో ఐపీఎల్ బెట్టింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వేసవికాలం కావడంతోపాటు ఏసీ రూముల నిర్వహణ వలన ఐపిఎల్ బెట్టింగ్ అనుకూలంగా ఏర్పాట్లు చేసి మద్యం తో పాటు బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో మిర్యాలగూడ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో గోవా క్యాష్ నోవా తరహాలో బెట్టింగ్ నిర్వహిస్తున్న పలువురుని పోలీసుల అరెస్టు చేశారు.
పట్టించుకోని అధికారులు
బెల్ట్ షాపులలో బెట్టింగ్ నిర్వహిస్తున్న పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని ఎక్కువగా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలలోని ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బెల్ట్ షాప్ ల నుంచి నెలవారి మామూలు తీసుకొని నిర్వాహకులకు సహకరిస్తున్నట్లు పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. రైల్వే స్టేషన్ రోడ్డు సమీపంలో భారీగా బెల్ట్ షాపులు నిర్వహణ జరుగుతున్న పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు నెలకు 35 వేల రూపాయల చొప్పున మామూలు వసూలు చేసి చూచి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి బెల్ట్ షాపులపై నిఘా ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.






