సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : డీజీపీ శివధర్ రెడ్డి

by Muthe.Rajitha |

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీ శివధర్ రెడ్డి ప్రజలకు సూచించారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : డీజీపీ శివధర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) మహిళా జర్నలిస్టుల కోసం ఆన్‌లైన్‌బట్‌అనాఫ్ రైడ్ అనే థీమ్‌తో సైబర్ హైజీన్ వర్క్‌షాప్‌ను మంగళవారం నిర్వహించింది. డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా, ఆత్మవిశ్వాసంతో పయనించడానికి మీడియా నిపుణులకు అవగాహన, పరిజ్ఞానం అందించడమే ఈ వర్క్‌షాప్ ముఖ్య ఉద్దేశం అని పేర్కోన్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఆధ్వర్యంలో , నిర్వహించిన వర్క్‌షాప్‌కు డీజీపీ బి. శివధర్ రెడ్డి, ముఖ్య అతిధిగా హజరైయ్యారు. సైబర్ నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. మీడియా నిపుణులు తమను తాము కాపాడుకోవడమే కాకుండా, సైబర్ భద్రత, బాధ్యతాయుతమైన డిజిటల్ వినియోగం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి తమ వేదికలను ఉపయోగించుకోవాలని అన్నారు.

కార్యక్రమంలో వివిధ మీడియా సంస్థలకు చెందిన మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు. వాటిన్స్ సీఈఓ సన్నీ ఎన్.వి. నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సైబర్ హైజీన్, కొత్తగా వస్తున్న సైబర్ ముప్పులు, భద్రతా చర్యలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ వర్క్‌షాప్‌లో సైబర్ నేరాల ధోరణులు, పాత్రికేయులు ఎదుర్కొంటున్న డిజిటల్ ప్రమాదాలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని జరిగే సైబర్ స్టాకింగ్, ఆన్‌లైన్ వేధింపులు, సెక్స్‌టార్షన్, నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్, చిత్రాలను మార్ఫింగ్ చేయడం, మాట్రిమోనిల్ మోసాలు, సాధారణ సైబర్ నేరాలతో సహా కీలక అంశాలపై చర్చించారు. సైబర్ నేరగాళ్ల డిజిటల్ ప్రవర్తనను ఎలా దుర్వినియోగం చేస్తారనే అంశాలను కేస్ స్టడీలతో వివరించారు.

Next Story