టీ20 జట్టులోకి శ్రేయస్ అయ్యర్.. BCCI కీలక ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-26 13:26:26  IST  )

న్యూజిలాండ్‌తో జరుగనున్న చివరి రెండు టీ20 మ్యాచ్‌లపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.

టీ20 జట్టులోకి శ్రేయస్ అయ్యర్.. BCCI కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌(India vs New Zealand)తో జరుగనున్న చివరి రెండు టీ20 మ్యాచ్‌లపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. గాయం కారణంగా చివరి రెండు మ్యాచ్‌లకు ఆల్‌రౌండర్ తిలక్ వర్మ(Tilak Verma) దూరంగా ఉంటారని స్పష్టం చేసింది. దీంతో టీ20 జట్టులో శ్రేయస్ అయ్యర్‌(Shreyas Iyer)ను కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్నది. మిగిలిన మరో రెండు మ్యాచుల్లో ఓడినా పెద్ద ప్రభావం ఉండదు. తొలి మ్యాచ్ జనవరి 21న నాగ్‌పూర్‌లో, రెండో మ్యాచ్ జనవరి 23న రాయ్‌పూర్‌లో, మూడో మ్యాచ్ జనవరి 25న గౌహతిలో ఇప్పటికే జరిగిపోయాయి. మిగిలిన నాలుగో మ్యాచ్ జనవరి 28న విశాఖపట్నంలో, చివరి టీ20 మ్యాచ్ జనవరి 31న తిరువనంతపురంలో జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ల వేదికలు కూడా ప్రకటించబడ్డాయి.

భారత జట్టు: అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

Next Story