తిలక్ వర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అప్‌డేట్.. కివీస్ సిరీస్‌కు దూరం

by Malleboina Mahesh |

భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ గాయం కారణంగా న్యూజిలాండ్ టీ 20 సిరీస్ మొదటి 3 మ్యాచులకు దూరం అయిన విషయం తెలిసిందే.

తిలక్ వర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అప్‌డేట్.. కివీస్ సిరీస్‌కు దూరం
X

దిశ, వెబ్ డెస్క్: భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Verma) గాయం కారణంగా న్యూజిలాండ్ టీ 20 సిరీస్ మొదటి 3 మ్యాచులకు దూరం అయిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం అతను బీసీసీఐ (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నారని, ఇప్పటికే ఫిజికల్ ట్రైనింగ్ ప్రారంభించి స్థిరంగా పురోగతి సాధిస్తున్నారని బీసీసీఐ వెల్లడించింది. అయితే తిలక్ వర్మ పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించడానికి మరికొంత సమయం పడుతుందని, అందుకే న్యూజీలాండ్‌తో జరుగుతున్న ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మిగిలిన చివరి రెండు మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడని బీసీసీఐ స్పష్టం చేసింది.

తిలక్ వర్మ ఫిబ్రవరి 3న పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాత ముంబైలో జట్టుతో చేరుతారని, ఆపై 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌లకు అందుబాటులోకి వస్తాడని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అలాగే తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), మిగిలిన మ్యాచ్‌లకు కూడా జట్టులో కొనసాగుతారని సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసింది. దీనితో పాటు మిగిలిన రెండు టీ20ల కోసం భారత అప్‌డేటెడ్ జట్టును కూడా ప్రకటించింది.

భారత అప్‌డేటెడ్ టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్.

Next Story