- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ తో మ్యాచ్ ఆడండి.. పాక్ కు బంగ్లాదేశ్ రిక్వెస్ట్
ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఇండియాతో ఆడాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్‌ను కోరింది.

దిశ, వెబ్ డెస్క్ : ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఇండియాతో ఆడాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్‌ను కోరింది. బంగ్లా అభ్యర్థన క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్ లో అయితే తాము మ్యాచులు ఆడబోమని, వేదికలు మార్చాలని బంగ్లా క్రికెట్ బోర్డు ఐసీసీ ని కోరగా.. అందుకు ఐసీసీ తిరస్కరించింది. దీంతో తాము టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనడం లేదని ప్రకటించింది. అయితే తాము బంగ్లాదేశ్ కు మద్దతు ఇస్తున్నామని, తాము కూడా భారత్ తో జరిగే మ్యాచులు ఆడబోమని పాక్ క్రికెట్ బోర్డు పేర్కొంది. అందుకు అనుగుణంగానే ఇటీవల భారత్-పాక్ మ్యాచ్ ను పాక్ బాయ్ కాట్ చేసింది.
ఈ క్రమంలో BCB ప్రెసిడెంట్ మొహమ్మద్ అమీనుల్ ఇస్లాం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్ తమకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, క్రికెట్ అభిమానులు, ఆట భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 15న ఇండియాతో మ్యాచ్ ఆడాలని పాకిస్తాన్‌ను కోరారు. సోమవారం లాహోర్‌లో ICC, PCB, BCB అధికారుల మధ్య జరిగిన సమావేశానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు స్వయంగా వెళ్లి చర్చలు జరిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అమీనుల్ ఇస్లాం ఈ ప్రకటన చేసారు.
ఈ నేపథ్యంలో PCB ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందని పాక్ మీడియా చెబుతోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాదు, శ్రీలంక అధ్యక్షుడు కూడా ఈ మ్యాచ్ జరగాలని కోరుతూ పాకిస్తాన్‌కు ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ICC కూడా బంగ్లాదేశ్ మీద ఎలాంటి శిక్షలు విధించలేదని, భవిష్యత్తులో ఒక ICC టోర్నమెంట్‌ను హోస్ట్ చేసే అవకాశం ఇస్తామని హామీ ఇచ్చింది. మొత్తానికి ఈ పరిణామాలన్నీ ఫిబ్రవరి 15న కొలంబోలో ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ జరగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.






