మంత్రి పొన్నం ప్రభాకర్ తో బీసీ కమిషన్ భేటీ

by Muthe.Rajitha |

మంత్రి పొన్నం ప్రభాకర్ తో బీసీ కమిషన్ భేటీ అయి, ఇటీవలి కుమ్మెర ఘటనపై మంత్రికి వివరించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ తో బీసీ కమిషన్ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : మంత్రి పొన్నం ప్రభాకర్ తో తెలంగాణ బీసీ కమిషన్ భేటి అయింది. గురువారం తెలంగాణ సెక్రటేరియట్ లో కమిషన్ చైర్మన్ నిరంజన్, కమిటీ సభ్యులు తిరుమలగిరి సురేందర్, జయప్రకాష్, బాలలక్ష్మీలు మంత్రితో సమావేశమయ్యారు. ఇటీవల నాగర్‌ కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అంశాలు, అనంతరం జరిగిన పరిణామాలను పొన్నం ప్రభాకర్ కు బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు వివరించారు. దాడి ఘటనపై కమిషన్ రూపొందించిన నివేదికను ప్రజలు ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జరిగిన ఘటనపైన మంత్రి, బీసీ కమిషన్ తమ విచారాన్ని వ్యక్తం చేశారు.

Next Story