నీకు చేతకాదని ఒప్పుకో.. నేను రంగంలోకి దిగుతా: CM రేవంత్‌కు బండి సంజయ్ సవాల్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-05 15:22:42  IST  )

కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో కరీంనగర్‌కు రూ.1400 కోట్లు ఇచ్చానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

నీకు చేతకాదని ఒప్పుకో.. నేను రంగంలోకి దిగుతా: CM రేవంత్‌కు బండి సంజయ్ సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో కరీంనగర్‌కు రూ.1400 కోట్లు ఇచ్చానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పచ్చి అబద్దాలాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. సీఎంకు నిజంగా దమ్ముంటే ఆ నిధులు ఎప్పుడు ఇచ్చారు? ఏయే అభివృద్ధి పనులకు ఖర్చు చేశారు? అనే వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘నన్ను కోసినా నయాపైసా లేదు’ అని పదే పదే చెప్పిన రేవంత్ రెడ్డికి నిధులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని కేంద్రాన్ని నిందించడం విచిత్రంగా ఉందన్నారు. ‘రేవంత్ రెడ్డిగారు.. మీలో రోశం, పౌరుషం చచ్చిపోయిందా? కేసీఆర్ పంపే మూటలతోనే ఢిల్లీకి పంపి సీఎం సీటును కాపాడుకుంటున్నారా? అందుకే ఆ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నానని ఒప్పుకుంటే చెప్పండి.. కేసీఆర్ కుటుంబం సంగతి మేం చూస్తాం. మా భుజం మీద తుపాకీ పెట్టి ఇతరులను కాలుద్దామంటే.. ఆ ట్రాప్‌లో ఇరుక్కోవడానికి మేం సిద్ధంగా లేం. సీఎంకు రోషం, పౌరుషం చచ్చిపోయిందని ఒప్పుకుంటారా?. కేసీఆర్ పంపే మూటలను ఢిల్లీకి పంపి సీఎం సీటును కాపాడుకుంటున్నారా? అందుకే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నానని ఒప్పుకుంటారా?. మీకు చేతగాదని ఒప్పుకుంటే కేసీఆర్ కుటుంబం సంగతి మేం చూస్తాం’’అని అన్నారు.

కరీంనగర్, వరంగల్ పట్టణాలను జంట నగరాలుగా మార్చి డంపింగ్ యార్డ్‌ను తరలిస్తానని సీఎం చెప్పడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. డంపింగ్ యార్డు తరలింపు కోసం కేంద్రం నుండి రూ.50 కోట్లు మంజూరు చేయించడంతోపాటు చెత్త బయో మైనింగ్ కోసం మరో రూ.18 కోట్లు విడుదల చేసినా.. ప్రత్యామ్నాయ స్థలం చూపకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే అడ్డుకుంటోందని ఆరోపించారు.

Next Story