వాలీబాల్ ఆడిన బండి సంజయ్

by Gantepaka Srikanth |

కరీంనగర్ హౌజింగ్ బోర్డు కాలనీ సరస్వతి శిశు మందిర్‌లో రెండు రోజుల పాటు నిర్వహించే ఆటల పోటీలను (ఖేల్ ఖుద్) జ్యోతి ప్రజ్వలన చేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.

వాలీబాల్ ఆడిన బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ హౌజింగ్ బోర్డు కాలనీ సరస్వతి శిశు మందిర్‌లో రెండు రోజుల పాటు నిర్వహించే ఆటల పోటీలను (ఖేల్ ఖుద్) జ్యోతి ప్రజ్వలన చేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడారు. సరస్వతి శిశు మందిర్ స్కూల్ అంటే దేశ భవిష్యత్తును నిర్మించే కర్మాగారమని కొనియాడారు. అలాంటి గొప్ప స్కూల్‌లో చదువుకోవడం గర్వంగా ఉందన్నారు. కరీంగనర్ పార్లమెంట్ పరిధిలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలకు పక్కా భవనాలు, ల్యాప్ టాప్ తదితర సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇప్పటికే ‘మోడీ కానుక’గా సరస్వతి శిశు మందిర్‌లో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Next Story