హామీలు అమలు చేయకుంటే ఆందోళన చేస్తాం : బండి సంజయ్

by Muthe.Rajitha |

కాంగ్రెస్​ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందడంతో అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్​ పేర్కొన్నారు.

హామీలు అమలు చేయకుంటే ఆందోళన చేస్తాం : బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందడంతో అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమార్​పేర్కొన్నారు. ధాన్యం, మొక్కజోన్న శనగ కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. శుక్రవారం సీఎం రేవంత్​రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈసందర్భంగా వివరిస్తూ రబీ సీజన్​లో క్వింటాల్​కు రూ. 500 బోనస్​చెల్లించాలని తాలు, తరుగు, తేమ పేరు చెప్పి దోచుకుంటున్న దళారుల నుంచి రైతు ఆదుకుని ప్రతి గింజను మద్దతు దరకే కొనుగోలు చేయాలని డిమాండ్​చేశారు. తాలు, తరుగు, తేమ లేకుండా వడ్లు కొంటానన్న హామీని సమాధి చేశారని, కళ్లముందే తేమ పేరుతో రైతులను నిలువునా ముంచుతున్నా ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. మండుటెండల్లో కొనుగోలు కేంద్రాలవద్ద రైతులు పడుతున్న ఇబ్బందులు మీకు పట్టవా, వడ్లకు బోనస్ హామీ అంతా ఉత్తిదే అంటూ ఎద్దేవా చేశారు. గత రబీ సీజన్ కూ బోనస్ ఎగ్గొట్టి ఈ సీజన్ లోనూ బోనస్ కు పాతరేసినట్లేనా అంటూ ప్రశ్నించారు.

పత్తి పంటకు మద్దతు ధర ఎగానామం పెట్టి రైతులను ముంచారని, మొక్కజొన్నకు కేంద్రం ఎమ్మెస్పీ ఇస్తున్నా కొనుగోలు బాధ్యతను విస్మరించి దళారులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో రెండున్నరేళ్లలో 5 లక్షలకుపైగా ఎకరాల్లో పంట నష్టపోతే జరిగితే ఏం చర్యలు తీసుకున్నారని చెప్పాలని, ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.5 వేల కోట్లు చెల్లించాలని కానీ రూ.260 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. దళారులకు దోచిపెట్టి రైతులను రోడ్డున పడేయడమే కాంగ్రెస్​విధానామా, పౌరసరఫరాల సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టారని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ రూ.56 వేల కోట్ల అప్పులతో దివాళా తీయించిందన్నారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో సంస్థను రూ.లక్ష కోట్ల అప్పుల పాలు చేశారని, వరంగల్ డిక్లరేషన్ ను పాతిపెట్టి రాయపూర్ ఏఐసీసీ రైతు తీర్మానాలకు తిలోదకాలిచ్చారా అని పేర్కొన్నారు.

రబీ సీజన్ లో రైతుల బాధలపై ఏనాడైనా సమీక్షించారా, వడగాల్పులతో జనం అల్లాడుతుంటే డిజాస్టర్ మంత్రి నిద్రపోతున్నారని నిలదీశారు.ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోతుంటే సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఎందుకు చేయలేదన్నారు.కరప్షన్, కలెక్షన్, ల్యాండ్ సెటిల్ మెంట్లు తప్ప రైతుల కన్నీటి వెతలతో మీకు పనిలేదని, నమ్మి ఓటేసిన పాపానికి అన్నదాతలను నట్టేట ముంచుతారా అని విరుచుక పడ్డారు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర పడినా మీకు చలనం లేదని, తక్షణమే రైతులను ఆదుకోవాలని, అన్నదాతలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు.

Next Story