లెన్స్ కారణంగా ప్రాణాలు పోయేవి : అక్షయ్ కుమార్

by Disha Web Desk 12 |
లెన్స్ కారణంగా ప్రాణాలు పోయేవి : అక్షయ్ కుమార్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ తాజా చిత్రం 'బచ్చన్‌ పాండే' భారీ వసూళ్లు రాబడుతోంది. ఇందులో కనికరం లేని గ్యాంగ్‌స్టర్‌‌గా కనిపించిన అక్షయ్.. ప్రజలను చంపే క్రూరమైన పాత్రను పోషించాడు. అయితే క్యారెక్టర్‌కు సరిపోయే వేషధారణ కోసం చాలా రిస్క్ చేయాల్సి వచ్చిందని తెలిపాడు అక్షయ్. ఈ మేరకు 'కంటికి 'స్టోన్‌ ఐ లెన్స్‌'ను వాడటంతో నన్ను నేను చూసుకునే ధైర్యం చేయలేకపోయాను. దాన్ని పెట్టుకొని నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది.

షూటింగ్‌ మొదటి రోజు ఆ లెన్స్‌ సెట్‌ చేసుకోవడానికి 15 నిమిషాలు పట్టగా.. తర్వాత రోజు నుంచి 2 నుంచి 3 నిమిషాల్లోనే సెట్ చేసుకున్న. వాటివల్ల ఏది సరిగ్గా కనిపించేది కాదు' అని వివరించాడు. అంతేకాదు 'స్టోన్ ఐ లెన్స్' వినియోగించడం వల్ల ఓ సారి ప్రాణం పోయే ప్రమాదం నుంచి బయటపడ్డానన్న హీరో.. సినిమా షూటింగ్ అయిపోయేంత వరకు అవి ధరిస్తూనే ఉన్నానని తెలిపాడు.



Next Story

Most Viewed