IPL లో బ్రెవిస్ రికార్డ్.. బీబీ ఏబీ వీడియో వైరల్

by Dishafeatures2 |
IPL లో బ్రెవిస్ రికార్డ్..  బీబీ ఏబీ వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2022లో ప్రతి టీం తనదైన ఆటతీరుతో దూసుకుపోతోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్‌లోని 18 బ్యాటర్ డేవాల్డ్ బ్రెవిస్ తెగ ఫేమస్ అయిపోతున్నాడు. అతడు కొట్టే షాట్‌లకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అతడి ఆటతీరుతో అతడికి బేబీ ఏబీ అంటూ బిరుదునిచ్చారు. అయితే ప్రస్తుతం బేబీ ఏబీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పంజాబ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఏబీ బ్యాట్ ఝులిపించాడు. పీబీకేఎస్ లెగ్ స్పిన్నర్ చాహర్ బైలింగ్‌ వరుస బౌండరీలు బాదాడు. వరుసగా నాలుగు సిక్సులతో అభిమానులంతా అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బేబీ ఏబీ మొత్తం 5 సిక్సులు కొట్టగా వాటిలో చాహర్ బౌలింగ్‌లోనే వరుసగా 4 సిక్స్‌లు బాదాడు. దీంతో ఒకే మ్యాచ్‌లో 5 సిక్స్‌లు కొట్టిన యంగెస్ట్ ఆటగాడిగా బ్రెవిస్ రికార్డ్ చేశాడు.


Next Story