ప్లాస్టిక్ ప్లేట్స్ వద్దు.. విస్తరాకులు ముద్దు..!

by Batti.Sumithra |

ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి మంగళవారం ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాల పై పంచాయతీ సెక్రటరీ జాదవ్ మాధవ్ అవగాహన కల్పించారు.

ప్లాస్టిక్ ప్లేట్స్ వద్దు.. విస్తరాకులు ముద్దు..!
X

దిశ, కుబీర్ : ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి మంగళవారం ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాల పై పంచాయతీ సెక్రటరీ జాదవ్ మాధవ్ అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ ప్లేట్స్ వద్దు.. విస్తరాకుల్లో బోజనము ముద్దు అంటూ నినాదాలు చేశారు. తడి చెత్త, పొడి చెత్త, సానిటరీ చెత్త వేరుగా ఉంచాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. పని ప్రాంతంలో దొరికిన మోదుగ ఆకులతో విస్తార్లను కుట్టారు కూలీలు. ప్లాస్టిక్ వ్యర్థాలతో డ్రైనేజీలు నిండు కుంటున్న వైనాన్ని వివరించారు. వర్షాకాలంలో భూగర్భ జలాల పొదుపు పై అవగాహన కల్పించారు.

Next Story