- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పై అవగాహన సమావేశం
by Batti.Sumithra |
గంగాపూర్ గ్రామ రైతు వేదికలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్.) కార్యక్రమం పై అవగాహన శిక్షణ నిర్వహించనున్నట్లు రెబ్బెన తహసీల్దార్ సూర్యప్రకాశ్ తెలిపారు.

X
దిశ, రెబ్బెన : రెబ్బెన మండలంలోని బీఎల్ఓలు (బూత్ స్థాయి అధికారులు), బీఎల్ఏలు (బూత్ స్థాయి ప్రతినిధులు), బీఎల్ఓ సూపర్వైజర్‌లు, ప్రజాప్రతినిధుల కోసం బుధవారం ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు గంగాపూర్ గ్రామ రైతు వేదికలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్.) కార్యక్రమం పై అవగాహన శిక్షణ నిర్వహించనున్నట్లు రెబ్బెన తహసీల్దార్ సూర్యప్రకాశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్ఓ.)/ఆర్డీఓ ఆధ్వర్యంలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాల పై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు బీఎల్ఓలు, బీఎల్ఏలు, బీఎల్ఓ సూపర్వైజర్‌లు, ప్రజాప్రతినిధులందరూ తప్పనిసరిగా హాజరై ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రెబ్బెన తహసీల్దార్ సూర్యప్రకాశ్ కోరారు.
Next Story






