తెలంగాణలో ఆటోల బంద్.. క్లారిటీ

by Muthe.Rajitha |

తెలంగాణలో ఆటోల బంద్.. క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో మంగళవారం చేపట్టదలచిన ఆటోల బంద్ రద్దు అయిందని స్టేట్ టాక్సీ అండ్ ఆటో యూనియన్ ప్రకటించింది. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పెంటయ్య గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన రూ.12 వేల ప్రోత్సాహక హామీని వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేసారు. అలాగే హైదరాబాద్ నగరంతోపాటు ప్రధాన పట్టణాల్లో బైక్ టాక్సీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలోనే ఉద్యమం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అంటూ తీసుకు వచ్చిన మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్ల ఉపాధికి గండి కొట్టిన కాంగ్రెస్ కు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

Next Story