వెరిటాజ్ హెల్త్‌కేర్‌ను కొనుగోలు చేసిన అరబిందో ఫార్మా!

by Disha Web Desk 17 |
వెరిటాజ్ హెల్త్‌కేర్‌ను కొనుగోలు చేసిన అరబిందో ఫార్మా!
X

హైదరాబాద్: ప్రముఖ ఔషధ పరిశ్రమ సంస్థ అరబిందో ఫార్మాస్యూటికల్స్ సోమవారం వెరిటాజ్ హెల్త్‌కేర్ లిమిటెడ్(వీహెచ్ఎల్) వ్యాపారాలను, పలు ఆస్తులను రూ. 171 కోట్లకు కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. ఈ లావాదేవీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని, మే నాటికి పూర్తవుతుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. భారత్‌లో బయోసిమిలర్, ఇతర ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు వెరిటాజ్ కంపెనీ కొనుగోలు ఎంతో సహాయపడుతుందని అరబిందో ఫార్మా పేర్కొంది. వెరిటాజ్ కంపెనీ దేశీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో బ్రాండెడ్ జెనరిక్ ఫార్ములేషన్స్, ఇతర ఆరోగ్య సంరక్షణ సంబంధిత ఉత్పత్తులను విక్రయిస్తోంది. యాంటీ-ఇన్‌ఫెక్టివ్, పెయిన్ విభాగాలు వెరిటాజ్ ఆదాయానికి దోహదపడే ప్రధాన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలుగా ఉన్నాయి.

వెరిటాజ్ కంపెనీ 2020-21 లో రూ. 127 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది. అంతకుముందు మూడేళ్లుగా కంపెనీ సగటున ఏడాదికి 3.4 శాతం వృద్ధిని సాధిస్తోంది. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకు 4.9 శాతం వృద్ధితో రూ. 133.18 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీకి 700 మంది సేల్స్ రిప్రజెంటేటివ్‌లతో, 1,700 కంటే ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కలిగి ఉంది. 'వెరిటాజ్ కంపెనీ కొనుగోలు ద్వారా డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లో గణనీయమైన అభివృద్ధితో పాటు రాబోయే కొన్నేళ్లలో మెరుగైన వినియోగదారులను అరబిందో కలిగి ఉంటుందని అరబిందో ఫార్మా ఎండీ కె నిత్యానంద రెడ్డి అన్నారు. కాగా, సోమవారం అరబిందో ఫార్మా షేర్ ధర 1.61 శాతం నష్టపోయి రూ. 706.85 వద్ద ట్రేడింగ్ ముగిసింది.



Next Story

Most Viewed