- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా "అబ్రహం లింకన్"పై దాడి! : ఇరాన్ ప్రకటన
అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ క్షిపణి దాడి

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరిన తరుణంలో, అమెరికా యుద్ధనౌక USS అబ్రహం లింకన్ (CVN-72)పై తాము దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్(IRGC) నేవీ చేసిన ప్రకటన ప్రకారం.. తమ సరిహద్దుకు సుమారు 340 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా అణుశక్తితో నడిచే విమాన వాహక నౌక (Aircraft Carrier) USS అబ్రహం లింకన్‌పై నాలుగు బాలిస్టిక్ మిస్సైళ్లు, డ్రోన్లతో ఖచ్చితత్వంతో కూడిన దాడి చేసినట్టు పేర్కొంది. ఈ దాడిలో నౌక తీవ్రంగా దెబ్బతిన్నదని, అది తన కార్యకలాపాలను కొనసాగించలేక గల్ఫ్ జలాల నుండి వేగంగా వెనక్కి తగ్గిందని క్లెయిమ్ చేస్తోంది. అమెరికా ప్రారంభించిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'కి ప్రతీకారంగానే ఈ దాడిని చేపట్టినట్లు ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. తమ సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టామని ఇరాన్ ప్రచారం చేస్తోంది.
అయితే అమెరికా ఈ క్లెయిమ్‌లను కొట్టిపారేసింది. US సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఇరాన్ చేస్తున్నవన్నీ పచ్చి అబద్ధాలని స్పష్టం చేసింది. ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్లు నౌక దరిదాపుల్లోకి కూడా రాలేదని, USS అబ్రహం లింకన్ ఎటువంటి నష్టం లేకుండా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని వెల్లడించింది. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో భాగంగా ఈ నౌక ఇప్పటికీ ఎఫ్-35(F-35) యుద్ధ విమానాలను గాల్లోకి పంపుతూ తన మిషన్లను కొనసాగిస్తోందని అమెరికా అధికారులు ధృవీకరించారు. ఇరాన్ తన ప్రజలను మభ్యపెట్టడానికి మరియు నైతిక స్థైర్యాన్ని పెంచుకోవడానికి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తోందని పెంటగాన్ విమర్శించింది.
యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ (CVN-72) వంటి అణుశక్తితో నడిచే విమాన వాహక నౌక సముద్రంపై కదిలే ఒక అజేయమైన సైనిక కోట వంటిది. దీనిపై ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్, ఎఫ్-35సి స్టెల్త్ యుద్ధ విమానాలతో పాటు అధునాతన హెలికాప్టర్లు, నిఘా డ్రోన్లు నిరంతరం శత్రువులపై దాడి చేసేందుకు, నౌకకు రక్షణ కవచంలా ఉండేందుకు సిద్ధంగా ఉంటాయి. యుద్ధ సమయంలో ఈ భారీ నౌక ఒకే చోట స్థిరంగా ఉండకుండా గంటకు సుమారు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండటం వల్ల, రియల్‌టైమ్ ఉపగ్రహ నెట్‌వర్క్ సహాయం లేకుండా విశాలమైన సాగరంలో దీని కచ్చితమైన జాడను పసిగట్టడం, క్షిపణులతో గురిపెట్టడం శత్రువులకు దాదాపు అసాధ్యం.






