ఉగ్రవాద కుట్రలపై ఏటీఎస్ సర్జికల్ స్ట్రైక్.. రాష్ట్రవ్యాప్తంగా 21 చోట్ల ఏకకాలంలో దాడులు

by Malleboina Mahesh |   (  Updated:2026-02-15 07:26:56  IST  )

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానంతో యవత్మాల్ మరియు అహల్యానగర్ జిల్లాల్లో ముంబై ఏటీఎస్ భారీ ఆపరేషన్ చేపట్టింది. యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్న ముఠాల గుట్టు రట్టు చేసేందుకు 21 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఉగ్రవాద కుట్రలపై ఏటీఎస్ సర్జికల్ స్ట్రైక్.. రాష్ట్రవ్యాప్తంగా 21 చోట్ల ఏకకాలంలో దాడులు
X

దిశ, వెబ్ డెస్క్: విధ్వంసం సృష్టించేందుకు జరుగుతున్న ఉగ్రవాద కుట్రలను (Terrorist conspiracies) భగ్నం చేస్తూ ముంబై ఏటీఎస్ అధికారులు (Mumbai ATS officers) మహారాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా భారీ సోదాలు (Massive searches) నిర్వహిస్తున్నారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండి, యువతను తీవ్రవాదం వైపు ఆకర్షిస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు ఈ దాడులు చేపట్టారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే యవత్మాల్, అహల్య నగర్ (అహ్మద్ నగర్) జిల్లాల్లోని మొత్తం 21 ప్రాంతాల్లో ఏటీఎస్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి.

యవత్మాల్ జిల్లాలోని పుసాద్, ఉమర్‌ఖేడ్‌లలో 14 చోట్ల, అహల్యానగర్‌లో 7 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. విదేశీ ఉగ్రవాద సంస్థలతో కాంటాక్ట్‌లో ఉంటూ, స్థానిక యువతను ఉగ్రవాద కార్యకలాపాల్లోకి దింపేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది. ఈ క్రమంలో అనుమానిత నివాసాల్లో కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ప్రాథమిక దశలోనే తుడిచిపెట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా ఈ సోదాలపై ఏటీఎస్ అధికారులు అధికారికంగా స్పందించాల్సిన ఉంది.

Next Story