- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవరకద్రలో దారుణం.. నిద్రపోతున్న భర్తను కిరాతకంగా చంపిన భార్య
by Jakkula.Mamatha |
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలో దారుణం చోటుచేసుకుంది.

X
దిశ,దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకద్ర మండలం బస్వాయిపల్లి గ్రామంలో కొమ్మూరి కుర్వ నాగేష్(38) నిద్రిస్తున్న సమయంలో అతని భార్య కత్తితో దాడి చేసి హత్య చేసింది. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. విషయం గ్రామస్తులకు, బంధువులకు తెలియడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా నాగేష్ మృతి చెందాడు. దీనిపై బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు.
Next Story






