Jagapathi Babu: 62 ఏళ్ల వయసులో జగపతి బాబుకు అలాంటి కోరికలు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరో కమ్ విలన్ జగపతి బాబు(Jagapathi Babu) వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

Jagapathi Babu: 62 ఏళ్ల వయసులో జగపతి బాబుకు అలాంటి కోరికలు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో కమ్ విలన్ జగపతి బాబు(Jagapathi Babu) వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఫ్యామిలీ సినిమాల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. గత కొద్ది కాలంగా విలన్‌గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే జగపతి బాబు విలన్‌గా చేసిన చిత్రాలెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయనడంలో అతిశయోక్తి లేదు. ఓ వైపు వరుస మూవీస్ చేస్తూనే.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు.

ఇప్పటికే ఆయన పెట్టిన పోస్ట్ లెన్నో సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఎందుకంటే.. ఆయన కొంచెం వెరైటీ పోస్టులతో అందరి దృష్టిని ఆకర్షించేస్తారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఇన్‌స్టా్గ్రామ్(Instagram) ద్వారా జగపతి బాబు ఓ వీడియోను షేర్ చేశారు. అసలేం జరిగిందంటే.. ప్రసాద్ ఐమ్యాక్స్‌(I Max)లో సందడి చేశారు. ఉదయం తన కారులో ఒంటరిగా ఐ మ్యాక్స్‌కు సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా మారిపోయారు.

ఐ మ్యాక్స్‌(I Max)లోని గేమింగ్ జోన్‌కు వెళ్లి చిన్నపిల్లాడిలా షూటింగ్స్ గేమ్స్(Shooting Games) ఆడుతూ సందర్శకులకు ఒక్కసారిగా షాకిచ్చారు. ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ ‘‘పెద్ద వాడికి బుల్లి కోరికలు కలిగాయి’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Next Story