Thati Venkateswarlu: టీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. నేడు కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే

by GSrikanth |   (  Updated:2022-06-24 06:22:56  IST  )

Thati Venkateswarlu will join to Congress Party| అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో

Thati Venkateswarlu will join to Congress Party
X

దిశ, అశ్వారావుపేట: Thati Venkateswarlu will join to Congress Party| అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే తాటి ప్రధాన అనుచరులు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే, గురువారం రాత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి, రేవంత్ రెడ్డిలతో భేటీ అయిన తాటి వెంకటేశ్వర్లు, సుదీర్ఘ చర్చల అనంతరం పార్టీ మార్పుపై తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అశ్వారావుపేట నియోజకవర్గంలో మాస్ లీడర్‌గా మంచి ఫాలోయింగ్ ఉన్న తాటి, పార్టీని వీడటం టీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బే అని చెప్పాలి.

Next Story