- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాషెస్ సిరీస్: ఐదో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం - సిరీస్ ఆసీస్ కైవసం
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు ఘన విజయంతో ముగించింది.

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes series)ను ఆస్ట్రేలియా జట్టు ఘన విజయంతో ముగించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టెస్టు (Fifth Test)లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి, అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో సిరీస్‌ను ఆసీస్ అధికారికంగా కైవసం చేసుకోగా, ఇంగ్లండ్ జట్టు పరాజయంతో సిరీస్‌ను ముగించింది. సొంత గడ్డపై ఆస్ట్రేలియా బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించి జట్టుకు ఈ విజయాన్ని అందించారు. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది.
ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో ఇంగ్లాండ్ (England) బ్యాటర్లు విఫలమయ్యారు. ఆస్ట్రేలియా పేసర్లు, స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 342 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 156 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లను కట్టడి చేసేందుకు ఇంగ్లాండ్ బౌలర్లు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ 31.2 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయిన ఆసీస్ జట్టు లక్ష్యాన్ని చేదించింది. దీంతో 5 వికెట్ల తేడాతో ఐదో టెస్టు విజయంతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది.
ఈ ఐదో టెస్టులో మంచి ఫామ్ కనబరిచిన ట్రావిస్ హెడ్ (Travis Head) కు ప్లేయర్ ఆఫ్ ధి మ్యాచ్ అవార్డు రాగా, సిరీస్ మొత్తం కలిపి మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సిరీస్ ఆసాంతం నిలకడైన ప్రదర్శన కనబరిచిన ఆసీస్ ఆటగాళ్లపై క్రీడా వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. కెప్టెన్ నాయకత్వం, బౌలర్ల తెగువ ఈ విజయానికి ముఖ్య కారణాలుగా నిలిచాయి. మరోవైపు, ఈ ఘోర ఓటమితో ఇంగ్లండ్ జట్టు తీవ్ర విమర్శల పాలవుతోంది. బ్యాటింగ్ వైఫల్యాలు, కీలక సమయాల్లో చేసిన తప్పులే ఇంగ్లాండ్ ఓటమికి శాపంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






