- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Arvind Dharmapuri: ఫోన్ ట్యాపింగ్ బహిరంగ రహస్యం.. ధర్మపురి అర్వింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది బహిరంగ రహస్యమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది బహిరంగ రహస్యమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) అన్నారు. ఇవాళ నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ (BJP) నేతల ఫోన్లను లెక్కలేనన్ని సార్లు ట్యాపింగ్ చేశారని ఫైర్ అయ్యారు. నేడు విచారణ పేరుతో బీఆర్ఎస్ నేతలను బ్లాక్‌మెయిల్ చేస్తూ.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాటకాలు ఆడుతున్నాడని, కేసులో ఇన్వాల్వ్ అయిన వారిని పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.
అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్ని సార్లు విచారణ చేస్తారంటూ ధర్మపురి అర్వింద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫోన్లు ట్యాప్ అయ్యాయని యాపిల్ ఖుల్లంఖుల్లా చెప్పిందని గుర్తు చేశారు. ఇక నిజామాబాద్ (Nizamabad) పేరు మార్పుపై ఆయన మరోసారి రియాక్ట్ అయ్యారు. జిల్లా పేరు ఇందూరుగా మార్చే అవకాశం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. నిజాం నిరంకుశత్వానికి మారుపేరు.. నిజామాబాద్ అని, ఆ పేరు మాకెందుకు అని కామెంట్ చేశారు. శ్రీరాముడికి బీజేపీలో సభ్యత్వం ఉందని తాను నమ్ముతున్నానని.. నా నమ్మకాన్ని కాదనడానికి మహేశ్ కుమార్ గౌడ్ ఎవరు అంటూ ధర్మపురి అర్వింద్ కామెంట్ చేశారు.






