తిరుమలలో రథసప్తమికి ఏర్పాట్లు.. పర్యవేక్షించిన చైర్మన్, ఈవో, ఏఈవో

by Kema Shiva Kumar |

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో జనవరి 25న జరగనున్న రథసప్తమి వేడుకల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

తిరుమలలో రథసప్తమికి ఏర్పాట్లు.. పర్యవేక్షించిన చైర్మన్, ఈవో, ఏఈవో
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో జనవరి 25న జరగనున్న రథసప్తమి వేడుకల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఏఈవో వెంకయ్యచౌదరి కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. రథసప్తమిని చిన్న బ్రహ్మోత్సవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒకే రోజున శ్రీమలయప్ప స్వామి వారు ఏడు ప్రధాన వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.

వాహస సేవలు ఇలా..

జనవరం 25న ఉదయం 5.30 - 8.00 సూర్యప్రభ వాహన సేవతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహన కైంకర్యాల స్వీకరణ, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం అత్యంత విశిష్టమైన సేవ, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంభక్తాగ్రేసరుడిపై స్వామి వారి విహారం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంవటలకు వరకు చక్రస్నానం పుష్కరిణిలో పవిత్ర స్నానాలు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం కోరిన కోర్కెలు తీర్చే వేళ, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంసకల లోకాలకు అధిపతిగా దర్శనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం ప్రశాంతతకు చిహ్నంగా ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించనున్నారు. రథసప్తమి శనివారం రావడం వల్ల భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు నిరంతరం అన్నప్రసాదం, తాగునీరు, పాలు పంపిణీ చేసేలా టీటీడీ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇక సర్వదర్శనం భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లను క్రమబద్ధీకరించాలని అధికారులను చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు.

Next Story