- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదుపుతప్పి లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు జవాన్లు మృతి
భారీ మంచు కారణంగా ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

దిశ, వెబ్ డెస్క్: భారీ మంచు కారణంగా ఆర్మీ వాహనం (Army vehicle) అదుపుతప్పి లోయలో పడిపోవడంతో నలుగురు జవాన్లు (Four jawans) ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్ సెక్టార్ (Gulmarg Sector) సమీపంలో ఉన్న బూటాపత్రి అనే మంచు పర్వత ప్రాంతంలో చోటు చేసుకుంది. మంచు కురుస్తుండటంతో రహదారిపై వాహనం టైర్లు జారి, లోయలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ విషాద సంఘటన ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో చోటు చేసుకోగా.. తీవ్ర గాయాలతో నలుగురు జవాన్లు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను రెస్క్యూ టీమ్స్ (Rescue teams) వెలికితీసి ఆసుపత్రికి తరలించాయి. మరణించిన జవాన్ల కుటుంబాలకు సైన్యం, కేంద్ర ప్రభుత్వం (Central Govt) సంతాపం ప్రకటించాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆర్మీ ఆదేశించింది.






