- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mouthwash: మౌత్ వాష్ వాడుతున్నారా.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు రివీల్?
ప్రజెంట్ డేస్‌లో చాలా మంది మౌత్ వాష్‌లు వాడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజెంట్ డేస్‌లో చాలా మంది మౌత్ వాష్(mouthwash)లు వాడుతున్నారు. కొంతమంది ఓన్లీ మార్నింగ్ సమయంలో మౌత్ వాష్ ఉపయోగిస్తే.. మరికొంతమంది బ్రష్(Brush) తో పాటు నోటి శుభ్రత కోసం వాడుతుంటారు. అయితే కొన్ని రకాల మౌత్ వాష్ లు నోటిని క్లీన్ చేసి.. బ్యాక్టీరియా(Bacteria)ను చంపేస్తాయి. కానీ దీనివల్ల నోటి ఆరోగ్యం(oral health) కూడా క్షీణిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మౌత్ వాష్ ఉపయోగిస్తే బ్యాక్టీరియా తగ్గడం పక్కన పెడితే.. పెరిగే చాన్స్ అధికంగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది. బ్యాక్టీరియా పెరిగి గొంతు క్యాన్సర్(throat cancer), చిగుళ్ల వ్యాధి(Gum disease), కడుపు క్యాన్సర్లు(Stomach cancers) వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. చిగుళ్ల వ్యాధి కారణంగా శరీరంలో పలు పార్ట్స్‌పై ప్రతికూల ప్రభావం పడనుందని అంటున్నారు.
మౌత్ వాష్‌ల తయారీలో ఆల్కహాల్(Alcohol) ఉపయోగిస్తారట. కాగా నోటి క్యాన్సర్ ప్రమాదముందని నిపుణులు తెలుపుతున్నారు. రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు 40 ఏళ్ల పైబడిన వారు వాడితే.. నోటి క్యాన్సర్ వస్తుందట. మౌత్ వాష్‌ల్లో ఉండే న్యూక్లియేటమ్(nucleatum), ఫ్యూసోబాక్టిరియా(Fusobacteria), స్ట్రెప్టోకోకస్(Streptococcus) వంటివి బ్యాక్టీరియా పెరగడానికి దారితీస్తుంది. అంతేకాకుండా మౌత్ వాష్ నోట్లో కణితి(tumor) పెరిగేందుకు అవకాశమిస్తుందని అధ్యనయం చెబుతోంది.
కాగా సహజసిద్ధమైన() మౌత్ వాష్‌లు వాడడం ఆరోగ్యానికి మేలని నిపుణులు అంటున్నారు. కలబంద రసం(Aloe vera juice)లో వాటర్ కలుపుకుని పుకిలిస్తే నోరు క్లీన్ గా ఉండటమే కాకుండా చిగుళ్ల నుంచి వచ్చే రక్తస్రావాన్ని(Bleeding) అడ్డుకుంటుందట. అలాగే కొబ్బరి నూనె(coconut oil) పళ్ల(teeth)ను దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే లారిక్ యాసిడ్(Lauric acid), యాంటీ మైక్రోబియల్(anti-microbial)గా లారిక్ యాసిడ్(Lauric acid), యాంటీ ఇన్‌ఫ్లమేటరీ(anti-inflammatory) వంటివి నోటిలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెడుతోందని, చెడు శ్వాస(bad breath)ను దూరం చేస్తుందని చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.






