Eye health: ప్రతిరోజూ మందులు వేసుకుంటున్నారా.. కంటి ఆరోగ్యంపై ప్రభావం చూపనుందా..?

by Kodari Anjali |

మన శరీరంలో కన్ను ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Eye health: ప్రతిరోజూ మందులు వేసుకుంటున్నారా.. కంటి ఆరోగ్యంపై ప్రభావం చూపనుందా..?
X

దిశ, వెబ్‌డెస్క్: మన శరీరంలో కన్ను ముఖ్య పాత్ర పోషిస్తుంది. సర్వేంద్రియానం నయం ప్రధానమని పెద్దలు చెబుతుంటారు. కంటి చూపు బాగుంటూనే మనం దేన్నైనా ఆనందంగా వీక్షించగలం. ఇంద్రియాలన్నింటిలో కళ్లు ముఖ్యమైనవి. కానీ ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్ లో గంటల తరబడి వర్క్ చేయడం, డే అండ్ నైట్ అని తేడా లేకుండా స్మార్ట్ ఫోన్లలో నిమగ్నమవ్వడం వంటివి చేస్తున్నారు. తద్వారా కంటి చూపు మందగిస్తుంది. కళ్లపై భారాన్ని వేసి.. అస్పష్టమైన దృష్టిని కొనితెచ్చుకుంటున్నార.

ఇక కంటి సమస్య వస్తే కనుక ఏ పని కూడా సరిగ్గా చేయలేదు. మీ ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది. అలాగే తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది. వీపు, మెడ, భుజాల నొప్పితో కూడా బాధపడుతుంటారు. వీటితో పాటుగా శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతుంటారు. కాగా కళ్ల ఆరోగ్యంపై ఫోకస్ చేయడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. కళ్లకు విటమిన్ ఎ చక్కటి మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. చిలకడదుంపల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. తీపి బంగాళాదుంపలు బీటా కెరోటిన్ అద్భుతమైన మూలం. ఇది మన శరీరాలు కంటి ఆరోగ్యం.. దృష్టి సంరక్షణ కోసం విటమిన్ ఎగా మారుస్తుంది.

అయితే మీరు రోజూ వేసుకునే మందులు కళ్ల ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తాయని తాజాగా నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యల పేరుతో మీరు ప్రతి రోజూ వేసుకునే రకరకాల మందులు మీ కంటి ఆరోగ్యంపై చెడు ప్రభావం చేపుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే మధుమేహం, రక్తపోటు, బరువు తగ్గడం, మానసిక ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలకు తీసుకునే అనేక మందులు కంటి ఆరోగ్యానికి ప్రతికూలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.

Next Story