- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rice: మూడుపూటలా అన్నం తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
భారతదేశంలో తొంభై శాతం మంది తినేది తెల్ల అన్నమే.

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లో తొంభై శాతం మంది తినేది తెల్ల అన్నమే. కొంతమంది రోజుకు రెండు సార్లు మాత్రమే తింటారు. కానీ గ్రామాల్లో ఉండేవారు మూడుసార్లు తప్పకుండా వైట్ రైసే(White rice) తింటుంటారు. అన్నం అలవాటైన వారు మరేపదార్థాలు తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగదు. అయితే అన్నాన్ని కూడా అతిగా తినకుండా మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలని.. లేకపోతే పలు సమస్యలు(Many problems) తలెత్తే అవకాశాలున్నాయి తాజాగా నిపుణులు చెబుతున్నారు. ఏఏ సమస్యలు తలెత్తుతాయో ఓసారి చూద్దాం..
వైట్ రైట్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొవ్వు(Body fat) పెరిగిపోతుంది. బియ్యంలో కార్బోహైడ్రేట్ల(carbohydrates) పరిమాణం అధికంగా ఉంటుంది. కాగా బరువు పెరుగుతారు. తద్వారా ఊబకాయం(obesity) బారిన పడే చాన్స్ ఉంటుంది. అన్నాన్ని తినడం తగ్గించి.. దాని ప్లేస్‌లో చపాతీలు(Chapatis) తినడం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే రోజూ మూడు పూటల అన్నం తింటే గుండె ఆరోగ్యాని(Heart health)కి కూడా ప్రమాదమే. బ్రౌన్ రైస్(Brown rice) లేదా రెడ్ రైస్(Red rice) తినడం మేలు. రైస్ ఎక్కువగా తినడం కారణంగా కొలెస్ట్రాల్(Cholesterol) పెరుగుతుంది. దీంతోపాటుగా మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్(Metabolic syndrome risk) పెరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.






