ఏఆర్ రెహమాన్‌కు టాలెంట్ లేదు.. దుమారం రేపుతున్న నటి కామెంట్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-31 05:25:57  IST  )

బాలీవుడ్‌లో మళ్లీ మత వివక్షపై చర్చ మొదలైంది.

ఏఆర్ రెహమాన్‌కు టాలెంట్ లేదు.. దుమారం రేపుతున్న నటి కామెంట్స్!
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో మళ్లీ మత వివక్షపై చర్చ మొదలైంది. ఆస్కార్ అవార్డు విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్(A.R. Rahman) ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రియేటివ్ వ్యక్తులు కాకుండా ఇతరులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. కొన్నిసార్లు నియామకాల విషయంలో మతపరమైన పక్షపాతం ఉండొచ్చని అనిపిస్తోందని చెప్పారు. అయితే తన విషయంలో మాత్రం ఎప్పుడూ ప్రత్యక్షంగా అలాంటి వివక్షను ఎదుర్కోలేదని రెహమాన్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా మారడంతో ఆయన వివరణ కూడా ఇచ్చారు.

అయినప్పటికీ ఈ వివాదానికి ఇంకా చెక్ పడినట్లు లేదు. నిత్యం దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ(Rani Mukerji) షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను గత 30 ఏళ్లుగా బాలీవుడ్‌లో పనిచేస్తున్నానని, ఈ సమయంలో మతం లేదా కులం ఆధారంగా ఎలాంటి వివక్షను చూడలేదని ఆమె అన్నారు. బాలీవుడ్ అత్యంత సెక్యులర్ ఇండస్ట్రీ అని, ఇక్కడ ప్రతిభకే ప్రాధాన్యం ఉంటుందని రాణి తెలిపారు. ఈ ఇండస్ట్రీ తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని, హృదయపూర్వకంగా ఈ మాటలు చెబుతున్నానని ఆమె వ్యాఖ్యానించారు. ఇక బాలీవుడ్‌లో విజయం సాధించాలంటే ప్రేక్షకులతో కనెక్ట్ కావడం కీలకమని రాణి ముఖర్జీ అన్నారు.

ఎవరి పని వాళ్ల గురించి మాట్లాడుతుందని, ప్రేక్షకులు ఎవరిని ఆదరిస్తారో వారే ఇండస్ట్రీలో నిలబడతారని చెప్పారు. అంటే ఇండైరెక్ట్‌గా ఆయనకు టాలెంట్ లేదని చెప్పకనే చెప్పింది. ప్రజలు ఆదరించకపోవడం వల్లనే ఆయన హిందీలో రాణించలేకపోయారని అన్నదని అంతా రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. కాగా.. రాణి ముఖర్జీ ‘ మర్దానీ-3’ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తోంది. అభిరాజ్ మిన్వాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాణి మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివాని శివాజీ రాయ్ పాత్రలో తిరిగి వచ్చింది. మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోరాడే పాత్ర ఆమెది. ఇప్పటికే వచ్చిన రెండు పార్టులు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక మూడో పార్ట్ జనవరి 30 విడుదల కాగా.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.

Read More..

ఫరియాపై విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్.. అంత మాట అనేశాడేంటి!

Next Story